Thursday, May 16, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 07
7
యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానాం సృజామ్యహమ్‌

తాత్పర్యము : ఓ భరతవంశీయుడా! ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధినొందునో ఆ సమయమున నేను అవతరింతును.

భాష్యము : ఇక్కడ ”సృజామి” అను పదము ముఖ్యమైనది. అనగా ఆయన ఇచ్ఛానుసారము అవతరించగలడు. సర్వజనుల సంక్షేమము ఆయనకే తెలుసు గనక ఆయనే ధర్మాన్ని వేదాలలో పొందుపరచెను, ధర్మంతు సాక్షాద్‌ భగవత్‌ ప్రణీతం. అటువంటి వేద సారాన్ని భగవద్గీతలో తెలియజేసెను. అదేమనగా ” భగవంతుడిని శరణు పొందుట”. ఎప్పుడైతే నాస్తికులు ప్రబలమై ధర్మానికి ఆటంకములు కలిగించెదరో అప్పుడు ఆయన స్వయముగా గాని, తన భక్తులు, పుత్రులు లేదా గోప్యముగా గాని అవతరించును. ప్రతి అవతారము యొక్క ముఖ్యోద్దేశ్యము ప్రజలలో ధర్మము యొక్క లక్ష్యమైన భగవత్ప్రేమను జాగృతము చేయుటయే. ఈ విషయములన్నియును శాస్త్రములందు తెలియజేయబడినవి. శాస్త్రాలలో వివరణ లేనట్లయితే ఎవరినీ భగవంతుని అవతారముగా స్వీకరింప రాదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement