Saturday, April 27, 2024

స్కూల్​ టీచర్​పై రేప్​ కేసు.. కాంగ్రెస్​ ఎమ్మెల్యే పార్టీ నుంచి సప్పెన్షన్​

రేప్​ కేసులో నిందితుడిగా ఉన్న కేరళ కాంగ్రెస్​ ఎమ్మెల్యే ఎల్దోస్ కున్నపిల్లిని ఆరు నెలల పాటు సస్పెండ్​ చేస్తున్నట్టు కేరళ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ (కేపీసీసీ) ప్రకటించింది. పెరుంబవూర్​ ఎమ్మెల్యే ఎల్దోస్​ ఇచ్చిన వివరణ సహేతుకంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేపీసీసీ ప్రెసిడెంట్​ కె. సుదర్శన్​ తెలిపారు.  అతడిని ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ, జిల్లా కాంగ్రెస్​ కమిటీ సభ్యత్వాల నుంచి ఆరు నెలలపాటు తొలగిస్తున్నట్టు వెల్లడించారు.

కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్‌ను అనుమతిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయన నియోజకవర్గంలో శాసనసభ సభ్యుడిగా విధులు నిర్వర్తించాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని కేపీసీసీ ఆయనను కేపీసీసీ, డీసీసీ వ్యవహారాల నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది.  ఈ సమయంలో పార్టీ అతనిని గమనిస్తుందని, దానికి తగ్గట్టు తదుపరి చర్యలు ఉంటాయని పార్టీ నేతలు తెలిపారు. 

తిరువనంతపురంలోని ఓ టీచర్ ఈ మధ్య పెరుంబవూరు ఎమ్మెల్యేపై తనపై అత్యాచారం, హత్యాయత్నం చేశాడని కేసు పెట్టారు. ఈ కేసులో కోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అత్యాచారం, హత్యాయత్నంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే తనను అపహరించి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement