Monday, May 13, 2024

లవ్ పేరిట బాలికకు వేధింపులు.. నో చెప్పడంతో కత్తితో అటాక్.. 13 సెకండ్లలో 8 కత్తిపోట్లు..

8వ తరగతి చదివుతున్న స్టూడెంట్ ని లవ్ పేరుతో వేధిస్తున్నాడో వ్యక్తి.. చాలా రోజులుగా వెంటపడుతూ లవ్ చేయాలని హింస పెడుతున్నాడు. అయినా ఆ బాలిక నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో అసహనానికి గురయ్యాడు. తనపై ఎలాగైనా తన కసి తీర్చుకోవాలనుకున్నాడు. కత్తితో దాడి చేసి తన రాక్షసత్వాన్ని బయటపెట్టాడు. ఈ ఘటన బిహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో జరిగింది. డిసెంబర్ 19న జరిగిన ఈ ఇన్సిడెంట్ పై విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

8వ తరగతి చదువుతున్న బాలిక తన ఫ్రెండ్స్ తో కలిసి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తోంది. చాలా కాలంగా లవ్ పేరుతో వేధిస్తున్న వ్యక్తి తన అనుచరులతో కలిసి ఆమె వచ్చే దారిలో కాపుకాశాడు.. ఆమె ఆ ఏరియాకు రాగానే దొంగచాటుగా వచ్చి ఆమెపై కత్తితో దాడి చేశాడు. సడెన్ గా జరిగిన ఈ ఘటనతో ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. తనకు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అఘంతకుడు కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. దాదాపు 13సెకన్లలోనే 8 కత్తిపోట్లు దిగాయంటే ఆ దుర్మార్గుడు ఎంతలా విద్వేషం పెంచుకున్నాడో తెలుసుకోవచ్చు.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో  వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఒక వ్యక్తం అతన్ని లాగడానికి ప్రయత్నిస్తున్నా కూడా నిందితుడు అమ్మాయిని పదేపదే కత్తితో పొడవడం కనిపిస్తోంది.  బాధిత బాలికను గోపాల్‌గంజ్‌లోని సదర్ హాస్పిటల్ కి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పాట్నా మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement