Wednesday, May 8, 2024

చంద్ర‌బాబునాయుడికి – ప‌వ‌న్ క‌ల్యాణ్‌, దేవినేని ఉమా పుట్టిన‌రోజు విషెష్

నేడు టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందిస్తూ… ‘మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడి గారికి హృద‌యపూర్వ‌క జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. శ్రీ చంద్ర‌బాబు గారికి భ‌గ‌వంతుడు ఆశీస్సులు అందించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాల‌ని ఆకాంక్షిస్తున్నాను’ అని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. పట్టిసీమతో గోదావరి తల్లిని కృష్ణమ్మ చెంతకు చేయిపట్టి నడిపించిన అపర భగీరథుడు, దేశంలోనే మొదటి నదుల అనుసంధాన కర్త చంద్ర‌బాబు నాయుడి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అని టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వరరావు పేర్కొన్నారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి చంద్ర‌బాబు శ్రీ‌కారం చుట్టార‌ని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా, గొల్లపూడి వన్ సెంటర్ లో ఘనంగా చంద్ర‌బాబు నాయుడి పుట్టినరోజు వేడుకలు నిర్వ‌హించామ‌ని దేవినేని ఉమ తెలిపారు. ఈ మేర‌కు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement