Thursday, May 16, 2024

Breaking: పార్టీ మార్పుపై బైరెడ్డి సిద్దార్థరెడ్డి క్లారిటీ

వైసీపీ నేత, షాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పటికీ జగన్ మనిషినే అన్నారు. తాను లోకేష్ ని కలిశానని.. టీడీపీలోకి వెళ్తున్నానని.. కొందరు అసత్య ప్రచారం చేశారన్నారు. వాళ్ల సంగతేంటో తేల్చుతానంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. తాను కష్టకాలంలో వుండగా పార్టీలో చేర్చుకుని ఓ వేదికను ఇచ్చిన వైఎస్ జగన్ వెంటే జీవితాంతం వుంటానని సిద్దార్థ్ తెలిపారు. తనను తమ్ముడిలా చూసుకుంటూ మంచి అవకాశాలు కల్పిస్తున్న జగనన్నను దూరం చేసుకుని వైసిపి నుండి టిడిపిలోకి జంప్ అయ్యే అవసరం తనకు లేదన్నారు. తాను ఎప్పటికీ వైఎస్ జగన్ విధేయుడినే… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తనదని సిద్దార్థ్ అన్నారు. పార్టీలో చేర్చుకుని అతిచిన్న వయసులోనే నందికొట్కూరు ఇంచార్జి బాధ్యతలు అప్పగించి, అధికారంలోకి వచ్చాక షాప్ ఛైర్మన్ పదవి ఇచ్చి ఇలా సీఎం జగన్ తనకెంతో చేసారన్నారు. ఇన్ని అవకాశాలిచ్చిన పార్టీని తానెందుకు వీడతాను… ఆ ఆలోచన కూడా రానివ్వనని అన్నారు. రాజకీయంగా నేనంటే గిట్టనివారు… కొన్ని మీడియా సంస్థలు బ్రేకింగ్ ల కోసమే ఇలా పార్టీ మారుతున్నానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని సిద్దార్థ్ మండిపడ్డారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement