Saturday, May 25, 2024

Breaking : తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌ – జూన్ 4వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌యింది. ఈ మేర‌కు ఏప్రిల్ రెండోవారం నుండి పాలీసెట్ ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్ లైన్ లో స్వీక‌రించ‌నున్న‌ట్లు విద్యాశాఖ వెల్ల‌డించింది. కాగా జూన్ 4వ తేదీ వరకు పాలిసెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఉండనున్నట్లు తెలిపింది. జూన్ 4వ‌ తేదీన అప్లై చేసుకోని వారికి కూడా…. ఓ అవకాశాన్ని కల్పిచింది విద్యాశాఖ. వంద రూపాయల ఆలస్య రుసుముతో జూన్ 5వ తేదీ వరకు కూడా దరఖాస్తులు పాలిసెట్ కోసం చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. కాగా జూన్ 30వ తేదీన పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే పరీక్ష జరిగిన 12 రోజుల తర్వాత పాలిసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది విద్యాశాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement