Sunday, November 3, 2024

Breaking : గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డ్స్..విజ‌య‌వాడ‌కి రూ.10కోట్ల ప్రోత్సాహం..

విశాఖ‌ప‌ట్నం..విజ‌య‌వాడ‌కి గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డు వ‌చ్చింది. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ లో విజ‌య‌వాడ‌కు మూడో ర్యాంక్ ద‌క్కింది. దాంతో రూ. 10కోట్ల ప్రోత్సాహ‌కాన్ని ప్ర‌క‌టించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఐదు ల‌క్ష‌ల‌లోపు జ‌నాభా ఉన్న మున్సిపాలిటీ విభాగంలో పుంగ‌నూరుకు స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డు ద‌క్కింది. తిరుప‌తి కార్పొరేష‌న్ కు గార్బేజ్ ఫ్రీ సిటీ, సిటిజ‌న్ ఫీడ్ బ్యాక్ ,త్రీ స్టార్ రేటింగ్,స‌ఫాయి మిత్ర అవార్డులు ల‌భించాయి..దాంతో తిరుప‌తికి రూ.రెండు కోట్ల న‌గ‌దు ప్రోత్సాహ‌కాన్ని ప్ర‌క‌టించింది కేంద్రం..క‌డ‌ప కార్పొరేష‌న్ కు గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డు ద‌క్కింది. పుంగ‌నూరు,పిఠాపురానికి స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డులు వ‌చ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement