Sunday, November 28, 2021

ఆడబిడ్డను దూషిస్తే చరిత్ర హీనులవుతార‌న్న లీలావ‌తి

వినుకొండ: ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా అసెంబ్లీలో వైసీపీ నేతలు ప్రవర్తించారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణిని వైసీపీ నేతలు తూలనాడటం… చంద్రబాబు కంటతడి పెట్టడంపై ఆమె స్పందించారు. ఏపీలో దిగజారుతున్న తాజా రాజకీయ విలువలకు నిన్నటి ఘటన అద్దం పడుతోందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపమైన నందమూరి ఆడబిడ్డను దూషిస్తే చరిత్ర హీనులవుతారన్నారు.

మహిళలను అసభ్యంగా అవమానిస్తే భవిష్యత్తులో ఏ ఆడబిడ్డ రాజకీయాల్లోకొస్తుందని ప్రశ్నించారు. మహిళలు రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలనేది వైసీపీ కుట్రగా ఆమె చెప్పారు. సుదీర్ఘ కాలం రాజకీయ దిగ్గజంగా ఉన్న చంద్రబాబు నాయుడు కంటనీరు చూసిన ప్రతి కంటిలోనూ నీరుగారిందన్నారు. ఆయన గద్గద స్వరం విన్న ప్రతి మనసూ విలపిస్తుందన్నారు. కుటుంబం కంటే యావత్తు తెలుగు జాతికి, దేశానికి చంద్రబాబు చేసిన సేవలు గుర్తుకొచ్చి..నేడు ఆయన కంటే ఎక్కువగా ప్రతి మనసు గాయపడిందని లీలావతి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News