Wednesday, May 1, 2024

SRH vs RCB | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌‌సీబీ..

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు (గురువారం) సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తపడనున్నాయి. వరుస విజయాలతో జోరుమీదున్న ఎస్‌ఆర్‌‌హెచ్… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.

జట్ల వివరాలు :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :

ఫాఫ్ డు ప్లెసిస్ (c), విరాట్ కోహ్లి, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (WK), మహిపాల్ లోమ్రోర్, లాకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ :

అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, టీ నటరాజన్.

- Advertisement -

ఇంపాక్ట్ ప్లేయర్స్…

SRH: ట్రావిస్ హెడ్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, అన్మోల్‌ప్రీత్ సింగ్

RCB: అనుజ్ రావత్, వైషాక్ విజయ్‌కుమార్, స్వప్నిల్ సింగ్, సుయాష్ ప్రభుదేసాయి, హిమాన్షు శర్మ

సమరోత్సాహంతో సన్‌రైజర్స్..

వరుస ఓటములతో బెంగళూరు ఇప్పటికే నాకౌట్ రేసుకు దూరమైంది ఆర్‌‌సీబీ.. బెంగళూరు ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడగా ఒక్కదాంట్లో మాత్రం విజయం సాధించింది. ప్లేఆఫ్ అవకాశాలకు దాదాపు తెరపడడంతో మిగిలిన మ్యాచుల్లోనైనా మెరుగైన ప్రదర్శనతో కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. అయితే పటిష్టమైన హైదరాబాద్‌తో పోరు బెంగళూరుకు సవాల్‌గా తయారైంది.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత నిలకడైన ఆటతో అలరిస్తోంది. బ్యాటింగ్‌లో హైదరాబాద్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ.. ఇద్దరు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక హెన్రియ్ క్లాసెన్, ఐడెన్ మార్‌క్రమ్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, నితీష్ కుమార్ రెడ్డి తదితరులు కూడా మెరుపులు మెరిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement