Tuesday, May 21, 2024

LSG vs MI | ముంబయి ఢమాల్.. లక్నో సూపర్ విన్

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో లక్నో ఘన విజయం సాధించింది. హోమ్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై పై 04 విట్కెట్ల తేడా తో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ని తక్కువ పరుగులకే 144 పరిమితం చేసిన లక్నో… చేజింగ్ లోనూ అదరగొట్టింది.

ముంబై నిర్దేశించిన 145 పరుగుల టార్గెట్ ను 06 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. స్వల్ప ఛేదనలో మార్కస్ స్టోనిస్ ( 62 ) చేలరేగాడు. కెప్టెన్ కెల్ రాహుల్ (28) తో ఆకట్టుకున్నాడు. ఇక దీపక్ హూడ (18), నికోలస్ పూరన్ (14 నాట్ అవుట్ ) పరువలేదనిపించారు.

ఈ విజయం తో పాయింట్స్ టేబుల్ లో ఆరవ స్థానం లో ఉన్న లక్నో మూడవ స్థానానికి ఎగబాకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement