Thursday, July 25, 2024

Tributes – రాజీవ్ గాంధీ వ‌ర్దంతి…ఢిల్లీలోని వీర‌భూమిలో ప్ర‌ముఖ‌ల నివాళి


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా నేడు ఢిల్లీలోని వీర్ భూమిలోని రాజీవ్ స‌మాధి వ‌ద్ద ప‌లువురు నివాళుల‌ర్పించారు..కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కూడా రాజీవ్ స‌మాధిపై పుష్ప గుచ్చాలు ఉంచి అంజ‌లి ఘ‌టించారు. మాజీ మంత్రి చిదంబర్, సచిన్ పైలట్ వంటి ఇతర నాయకులు కూడా మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు.

మోడీ నివాళి..

ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించారు. ” మన మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారికి నా నివాళులు” అంటూ ఎక్స్‌లో ప్రధాని ట్వీట్ చేశారు.

శ్రీపెరంబుదూర్ లో ఆత్మ‌హుతి దాడిలో మృతి..

1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 1984లో 40 ఏళ్ల వయసులో పదవీ బాధ్యతలు చేపట్టారు. అత్యంత చిన్న వయసులో ప్రధాని అయ్యారు. డిసెంబర్ 2, 1989 వరకు భారతదేశ ప్రధానిగా పనిచేశారు. తమిళనాడు శ్రీపెరంబుదూర్ ఎన్నికల ర్యాలీకి వెళ్లిన సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) ఆత్మాహుతి దాడిలో మే 21, 1991లో మరణించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement