Saturday, April 27, 2024

హుజురాబాద్ బీజేపీలో ములసం? టీఆర్ఎస్ లోకి పెద్దిరెడ్డి?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో హుజూరాబాద్ లో ముసలం మొదలైంది. ఈటల రాకను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి.. తన అనుచరులతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. కోవిడ్ కారణంగా మూడు నెలలుగా పెద్దిరెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఈటల రాజీనామా నేపథ్యంలో త్వరలో హుజురాబాద్ కు ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఆపార్టీ తరుపున ఈటల బరిలో దిగబోతున్నారు. దీంతో పార్టీ హైకమాండ్ నిర్ణయంపై పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం ఈటల బీజేపీలో చేరారు. అయితే, ఈటలను బీజేపీలోకి తీసుకోవడం కరెక్ట్ కాదని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈటల బీజేపీలో చేరుతారనే ప్రచారం మొదలైనప్పటి నుంచే పెద్దిరెడ్డి వ్యతిరేకించారు. ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. తనను సంప్రదించకుండా ఈటల రాజేందర్‌ను ఎలా బీజేపీలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. ఈటలతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా తనను అడగకపోవడం తగదని పెద్దిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మూడు నెలల తర్వాత ఆయన బుధవారం హుజూరాబాద్‌కు వచ్చారు. కార్యర్తలు, అనుచరులు, సన్నిహితులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచారణపై పెద్దిరెడ్డి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. తనను కాదని, తనతో సంప్రదించకుండా ఈటలను పార్టీలో చేర్చుకోవడంపై పెద్దిరెడ్డి పార్టీ నిర్ణయంపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ వీడాలనే అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పెద్దిరెడ్డి బీజేపీలోనే కొనసాగుతారా? లేక టీఆర్ఎస్ లోకి వెళ్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ ఇంకా తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నేతలతో చర్చించారు. రెండు,మూడు రోజుల్లో మరోసారి సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరి ఆపార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆశావాహులు పెరుగుతోంది. సిట్టింగ్ స్థానం కావడం, అందులోనూ టీఆర్ఎస్ పార్టీని వీడి ఈటల బీజేపీలో చేరడంతో టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ఈ నేపథ్యంలో అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఇక, పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరితే.. టికెట్ ఇస్తారా? అన్నది కూడా డౌటే.

ఇదీ చదవండి: ప్రత్యేక అధికారిని నియమించిన ట్విట్టర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement