Thursday, April 25, 2024

ప్రత్యేక అధికారిని నియమించిన ట్విట్టర్..

తాత్కాలిక చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ ను నియమించినట్టు ట్విట్టర్ కేంద్రానికి తెలిపింది. కొత్త ఐటీ నిబంధనలను ట్విట్టర్ ఇంకా అమలు చేయకపోవడంపై ఆగ్రహంతో ఉన్న కేంద్రం మరోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఓ కొత్త అధికారిని నియమించినట్లు తెలిపింది. ఆ అధికారికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే కేంద్రంతో నేరుగా పంచుకుంటామని వెల్లడించింది. అంతకుముందు, కేంద్రం ఇదే ఆఖరి అవకాశం అంటూ ట్విట్టర్ కు తాజాగా నోటీసులు పంపింది. తమ నూతన ఐటీ నియమావళిని అంగీకరిస్తున్నట్టు సమ్మతి తెలిపేందుకు తుది అవకాశం ఇస్తున్నామని కేంద్రం పేర్కొంది. ఒకవేళ తమ నిబంధనలకు అంగీకరించకపోతే, ఉల్లంఘనలపై మినహాయింపులు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement