Wednesday, May 8, 2024

డ్ర‌గ్స్ కి బానిస‌యితే – చావే శ‌ర‌ణ్యం – మంత్రి త‌ల‌సాని

ప్ర‌పంచాన్ని డ్ర‌గ్స్ కుదిపేస్తోంద‌ని అన్నారు మంత్రి త‌ల‌సాని.. నార్త్ జోన్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో డ్ర‌గ్స్ నిర్మూల‌నపై అవ‌గాహ‌న స‌ద‌స్సు జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..చాలా మంది తెలియకుండానే డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారన్నారు. ఒక్కసారి డ్రగ్స్ కు బానిసలు అయితే చావే శరణ్యం అన్నారు. చాలా నేరాలలో నేరస్తులను క్షణాల్లో పట్టుకునే సత్తా తెలంగాణ పోలీసులకే ఉందన్నారు. కార్పొరేట్ ఆఫీలకు దీటుగా పోలీస్ స్టేషన్ కార్యాలయాలు ఉన్నాయన్నారు. సమాజంలో ఉన్న డ్రగ్స్ మాఫియా నిర్ములించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి డ్రగ్స్ పై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీసే డ్రగ్స్‌ను అందరం కలిసి అడ్డుకుందామన్నారు. డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడితే పోలీసులు ఎంతటి వారినైనా వదిలి పెట్టరని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement