Saturday, April 27, 2024

BIGG BOSS 5: ఆనీ మాస్టర్ అవుట్.. ఇంటి సభ్యుల గురించి ఏం చెప్పిందంటే..

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సిజన్ 5 క్లైమాక్స్ కు చేరుకుంటోంది. విజ‌యవంతంగా ప‌ద‌కొండు వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి ప్రవేశించింది. ఇక, 11వ వారానికి కొరియో గ్రాఫ‌ర్ ఆనీమాస్ట‌ర్ ఎలిమినేట్ అయింది. ఎలాగైనా.. ట్రోఫీతోనే తిరిగి ఇంటికి వెళ్లాలనుకున్న ఆనీ మాస్టర్‌ కల కలగానే మిగిలిపోయింది. ఫైన‌ల్ గా 11వ వారంలో హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయింది. నామినేషన్స్ లో ప్రియాంక, ఆనీ మాస్టర్ ఉండగా.. ఆమెకి తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఆనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. మొత్తం 77 రోజులపాటు ఆనీ మాస్టర్ బిగ్ బాస్ ఇంటి సభ్యురాలిగా ఉన్నారు.

ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆనీ.. ఒక్కొక్క సభ్యుడి గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. తొలుత రవి గురించి మాట్లాడుతూ.. మొదటి నుంచి ఇప్పటి వరకు తనను మోటివేట్ చేస్తూనే ఉన్నాడని తెలిపింది. ఇంట్లో అందరినీ అలానే మోటివేట్ చేయాలి.. టాప్ 3లో ఉండాలని చెప్పింది. ఇక, శ్రీరామచంద్ర తన తమ్ముడు లాంటి వాడని తెలిపింది. తర్వాత షణ్ముక్, సిరి, ప్రియాంక, సన్నీ, మానస్, కాజల్ గురించి మాట్లాడింది. ఇంటి సభ్యులు టాప్ 8లో ఉన్నందుకు కంగ్రాట్స్ అని చెప్పింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement