Saturday, April 27, 2024

చంద్ర‌బాబుకి అవ‌మానం..క‌ల‌త చెంది ఉద్యోగానికి రాజీనామా చేసిన అనితాదీప్తి..

ఏపీ అసెంబ్లీలో టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడికి జ‌రిగిన అవ‌మానానికి క‌ల‌త చెంది త‌న ఉద్యోగానికి రాజీనామా చేసింది అనితాదీప్తి. ఈమె టిడిపి సీనియ‌ర్ నేత,శాప్ మాజీ డైరెక్ట‌ర్ దుద్యాల జ‌య‌చంద్ర కుమారై. మెప్మాలో టౌన్ మిషన్ కోఆర్డినేటర్‌గా 2014లో ఉద్యోగంలో చేరిన ఆమె నిన్న రైల్వేకోడూరులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి అసెంబ్లీలో జరిగిన అవమానం తనను కలచివేసిందన్నారు. ఇలాంటి ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. త్వరలోనే తన రాజీనామాను ఉన్నతాధికారులకు అందించనున్నట్టు అనితాదీప్తి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement