Thursday, May 26, 2022

Flash: ఆటో బోల్తా పడి ముగ్గురు మృతి

కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బావుపేట వద్ద గురువారం రాత్రి ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమిండటంతో శుక్రవారం ఉదయం ముగ్గురు మరణించారు. వేములవాడకు వెళ్తుండగా బావుపేట వద్ద ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను మానకొండూర్‌ మండలం ముంజపల్లికి చెందిన మల్లయ్య, ఓదమ్మ, హారికగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement