Friday, May 20, 2022

న్యూ లుక్ లో – రాయ్ ల‌క్ష్మీ

టాలీవుడ్ లోకి కాంచ‌న మాల కేబుల్ టీవీ చిత్రంతో అడుగుపెట్టింది రాయ్ ల‌క్ష్మీ..ఇక లారెన్స్ న‌టించిన ‘కాంచన’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఈ భామ. ఐటెం గర్ల్ గా కూడా సుపరిచితం. మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. తోబా తోబ అనే ఐటెం సాంగ్‌తో పవన్ అశేష అభిమానులను అలరించిన ఈ సుందరి..ఇప్పుడు ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తోంది. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ ‘రాణీ రానమ్మ, రౌడీ బేబీ, ఝాన్సి IPS, టిప్సి’ చిత్రాలలో నటిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ముద్దుగా బొద్దుగా ఉండే ఈ భామ సడెన్ గా సన్నగా మారిపోయింది. చక్కనమ్మా చిక్కినా అందమే అన్నట్లుగా తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. సదరు ఫొటోల్లో తెలుపు రంగు డ్రెస్సులో ఏంజెల్‌లా మెరిసి పోతున్నది ఈ సుందరి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement