Saturday, April 27, 2024

కొత్త నినాదం వినిపిస్తోన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితా

టీఆర్‌ఎస్‌ పార్టీ నినాదం జై తెలంగాణ…ఆ పార్టీ పురుడు పోసుకున్నది జై తెలంగాణ నినాదం నుంచే..
అజెండా ఎదైనా జై తెలంగాణ నినాదాన్ని తమ అస్త్రంగా చేసుకుంది టీఆర్‌ఎస్‌ పార్టీ…ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు..ఆ నినాదాన్నే పఠించారు ఆ పార్టీ శ్రేణులు… అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఆ పార్టీకి ఎదురుగాలులు విస్తున్నాయి. దానికి కారణం బీజేపీ… దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలనేది బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌…దీని కోసం చేయాల్సిందల్లా చేస్తున్నారు. ప్రత్యేకంగా సెంటిమెంటును బలంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. తెలంగాణలో కూడా కొంత మేరకు సక్సెస్‌ అవుతూ వస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుగానే మేల్కొని బీజేపీ అస్త్రానికి చెక్‌ పెట్టేందుకు ఇప్పుడు మరో నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితా జై హనుమాన్‌ నినాదంతో ఈ మధ్య హడావుడి చేస్తున్నారు. మొన్నామధ్య కొండగట్టు అంజన్న సాక్షిగా హనుమాన్ చాలీసా పారాయణం ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతామని వెల్లడించారు. జగిత్యాల జిల్లా కొండగట్టును సందర్శించుకున్న కవిత మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంతి వేడుకలకు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. సహజంగా ‘జై శ్రీరామ్ అనేది బీజేపీ నినాదం. కానీ ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శ్రీరామ భక్తుడైన హనుమాన్ ని అస్త్రంగా పెట్టారు. జై హనుమాన్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు.


టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంఐఎంకు కొమ్ముకాస్తోందని బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గట్టిగానే ప్రచారం చేసి ఓ మెరకు సఫలమైంది. హైదరాబాద్‌లో భారీగానే సీట్లను గెలుచుకుంది. అంతకముందు కూడా దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఝలక్‌ ఇచ్చింది బీజేపీ. జై శ్రీరాం నినాదంతో బీజేపీ ప్రజల్లోకి బలంగా దూసుకుపోతోంది. దీంతో ఎలాగైనా బీజేపీకి పోటీగా ప్రజల్లోకి వెళ్లాలనేది టీఆర్‌ఎస్‌ వ్యూహంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement