Sunday, April 28, 2024

ఆకుప‌చ్చ కిరీటం..

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థనం..

ఆరు సంవత్సరాల అవిరళ కృషి
సీఎం కేసీఆర్‌ దార్శనికత విజయం
మొక్కలు నాటడంలో .. అగ్రగామి తెలంగాణ
ఆరు విడతల హరితహారంలో .. 176 కోట్ల మొక్కలు నాటి రికార్డు
2015 నుండి నిరాటంకంగా కొనసాగుతున్న కార్యక్రమం
హరితహారానికి .. సామాజికవనాలు, పల్లె ప్రకృతివనాలు, అర్బన్‌ నర్సరీలు, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ల తోడు
మూడేళ్ళుగా సాగుతున్న గ్రీన్‌ఛాలెంజ్‌తో మరింత ఉత్తేజం

హైదరాబాద్‌, : తెలంగాణ ఆకుపచ్చ కిరీ టంతో.. దేశం ముందు ఠీవీగా నిలిచింది. అడవులు తరిగి పోవడమే తప్ప.. పెరగడం చూడని దేశంలో గ్రీన్‌ కవర్‌ పెంచు కుని అటవీ విస్తీర్ణం పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ సగర్వపతాక ఎగరేసింది. ఇపుడు దేశ అత్యున్నత చట్టసభ సాక్షిగా.. తెలంగాణ అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా కేంద్రం ప్రశం సలు అందుకుంది. దేశవ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటగా, కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 38.17 కోట్ల మొక్కలు నాటినట్లు కేంద్రం ప్రకటించింది. అంతరించిపోయిన అడవుల విస్తీర్ణం పెంపునకు ప్రభుత్వం యజ్ఞంలా తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టిం దని చెప్పారు. పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెంపే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 2015లో హరిత కార్యక్ర మానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఏటా కోట్లాది మొక్కలను నాటుతూ సంరక్షిస్తున్నది. మన పిల్లల కోసం ఎన్ని ఆస్తులు కూడబెట్టాం అన్నది ముఖ్యం కాదు, మంచి బతుకు బతికేందుకు నివాసయో గ్య మైన వాతావరణం కల్పిస్తు న్నామా లేదా అన్నది ముఖ్యం అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం ప్రారంభం సందర్భంగా చెప్పారు. అవే మాటలు.. ప్రజలను భాగస్వాములను చేశాయి.
బలమైన సంకల్పం
అంతరించిపోయిన అడవుల విస్తీర్ణం పెంపుకు ప్రభు త్వం యజ్ఞంలా చేపట్టిన తెలంగాణకు హరితహారం సత్ఫలి తాలను ఇస్తున్నది. పర్యావరణ సమతుల్యతకు, పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం 2015లో హరితహారం కార్యక్ర మానికి శ్రీకారం చుట్టింది. జులై 3, 2015న చిలు కూరులో తొలి మొక్క నాటడం ద్వారా హరితహారం కార్యక్ర మాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత ఆరేళ్ళుగా ఈ కార్య క్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. లక్ష్యం దిశగా.. ప్రజలందరినీ కదిలించారు. భాగస్వామ్యులను చేశారు. అందుకే తెలంగాణ ఇపుడు పచ్చలపేరు అయింది. సందర్భం ఏదైనా.. సంతోషపడ్డపుడు మొక్కనాటడం ఇపుడు తెలం గాణలో అలవాటైంది. పుట్టినరోజు, పెళ్ళిరోజు, పండు గలు, ఇతర కార్యక్రమాలు.. వేడుకలు ఏవైనా మొక్కలు నాటడం అలవాటుగా మారుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావితరాల భవిష్యత్‌ కోసం ప్రజల మెదళ్ళలో ఇంకించిన భావ జాలమే.. ఆరేండ్లలో దాదాపు 200కోట్లకు పైగా మొక్కలు నాటేలా చేసింది. ఇపుడు ఏడో విడతకు తెలంగాణ సంసి ద్ధమైతోంది. మొక్క లు పెరగడం వల్ల వన్యప్రాణి స్వేచ్ఛా విహారం విస్తృతమైంది. తెలంగాణలో అటవీ ప్రాంతం పెరు గుదల 3.67 శాతం పెరిగిందని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక అందజేసింది. 2021 నాటికి మరో 4 శాతం పెరిగే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. తెలంగాణ ఆకుపచ్చ విజయానికి, మడమతిప్పని సంకల్పానికి ఇది నిదర్శనం. నిటారైన నిలువెత్తు విజయం. ఇప్పటికే తెలంగాణ ప్రభు త్వం రూ.4,230 కోట్లకు పైగా హరితహారం కోసం వెచ్చించింది. ఏడో విడత హరిత హారానికి సన్నద్ధమవుతోంది.
లక్ష్యం దిశగా..
24 శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచా లని లక్ష్యంగా పెట్టు కోగా, హరితహారంతో అటవీ విస్తీర్ణం ఏకంగా 4 శాతం పెరిగింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెం పు నకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమం అడవికి వరంలా మారింది. ఏటా కోట్లల్లో మొక్కలు నాటుతుండడంతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. హరితహారానికి ముందు రాష్ట్రం లో అటవీ విస్తీర్ణం 24 శాతం ఉండేది. ఈ కార్యక్రమం చేపట్టిన ఆరేండ్లలో ఏకంగా అటవీ విస్తీర్ణం 4 శాతం పెరిగి 28 శాతానికి చేరుకున్నది. ఈ విషయాన్ని ఫారెస్టు సర్వే ఆఫ్‌ ఇండియాలో స్వయంగా ప్రకటించింది. మరో 5 శాతం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 33శాతం అడవుల విస్తీర్ణం లక్ష్యం నెరవేరనున్నది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200కోట్ల మొక్కలు నాటారు.
సంరక్షణ బాధ్యత కూడా
తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో అదే స్థాయిలో నిర్వహణ కూడా చేపట్టింది. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలను భాగ స్వామ్యం చేసింది. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చింది. యజ్ఞంలా చేపట్టిన హరితహారం కార్యక్రమ లక్ష్యానికి అనుగుణంగా అవసరమైన మొక్కల కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నర్సరీల ఏర్పాటును ప్రోత్సహించింది. వివిధ నర్సరీలలో 200కోట్లకు పైగా మొక్కలు సిద్ధంగా ఉంచారు. ఇపుడు ఏడో విడతకు కూడా నర్సరీలు సిద్ధమయ్యాయి. సామాజిక వనాలు, పల్లె ప్రకృతి వనాలు, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు అన్నీ అనుబంధంగా జత కలిశాయి. సర్పంచ్‌లకు, స్థానిక ప్రజా ప్రతి నిధులకు మొక్కల పెంపకం, సంరక్షణ మీద టార్గెట్లు విధిం చింది. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్య తలను కూడా అధికారులకు అప్పగించింది. ప్రతి గ్రా మంలో మొక్కలకు నీరు పోసేందుకు ప్రత్యేక చర్యలు చేప ట్టింది. ఇవన్నీ ఆకుపచ్చ తెలంగాణకు బాటలు పరుస్తున్నాయి.
గ్రీన్‌ ఛాలెంజ్‌ తోడు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరువిడతల హరితహారానికి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం తోడయ్యింది. ఆకర్షణీయ నినాదంతో.. ప్రముఖుల నుండి పల్లె వరకు అందరినీ భాగస్వాములను చేస్తూ గ్రీన్‌ ఛాలెంజ్‌ను కోట్ల మొక్కలు నాటే స్థితికి తీసుకెళ్ళారు. కేంద్రం తెలంగాణ దేశంలో అధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా ప్రకటించడంపై ఎంపీ సంతోష్‌కుమార్‌ హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ స్ఫూర్తి, లక్ష్యసాధనపై ఉన్న గురి.. తెలంగాణకు నిజంగానే హరితహారమేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement