Saturday, April 27, 2024

ప్రేక్షకులు లేకుండానే.. విండీస్‌తో వన్డే సిరీస్‌..

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య ఈ నెల 6నుంచి జరగనున్న వన్డే సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే ఈ సిరిస్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నట్లు గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (జీసీఎ) తెలిపింది. ఫిబ్రవరి 6నుంచి 11వరకు మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. ఇప్పటికే టీమిండియా అహ్మదాబాద్‌ చేరుకుని బయోబబుల్‌లోకి ప్రవేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వన్డే సిరీస్‌ జరగనుండగా..6న జరిగే తొలి వన్డే భారత క్రికెట్‌ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుంది. వన్డే ఫార్మాట్లో భారత్‌కు ఇది 1000వ మ్యాచ్‌ కావడం విశేషం. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే వెయ్యి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. కరోనా కారణంగా అభిమానులను స్టేడియంలోకి అనుమతించడం లేదని జీసీఎ వెల్లడించింది.

టీ20 సిరీస్‌కు 75శాతం ప్రేక్షకులు..

భారత్‌-విండీస్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరగనుంది. స్టేడియంలోని మొత్తం సీట్ల సామర్థ్యంలో 75శాతం అక్యుపెన్సీతో మ్యాచ్‌లను నిర్వహించుకునేందుకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అనుమతించింది. వన్డే సిరీస్‌ అనంతరం ఫిబ్రవరి 16, 18, 20వ తేదీల్లో కోల్‌కతా వేదికగా మూడు టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement