Saturday, April 27, 2024

ఐదో టెస్టు రద్దు అవడం దురదృష్టకరం: కోహ్లీ

ఇంగ్లండ్ తో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ రద్దుపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. మ్యాచ్ ఆగిపోవడం దురదృష్టకరమని చెప్పాడు. యూఏఈలో అయినా బలమైన బయోబబుల్, సురక్షితమైన వాతావరణం ఉంటుందని భావిస్తున్ననని తెలిపారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బంది కూడా కరోనా బారిన పడటంతో ఈ మ్యాచ్ రద్దయింది. ఊహించని విధంగా టెస్ట్ మ్యాచ్ రద్దవడంతో… చివరి టెస్ట్ రద్దు కావడంతో మన ప్లేయర్లందరూ లండన్ నుంచి యూఏఈకి వచ్చేశారు. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ లో వీరు ఆడనున్నాయి. ఇంకోవైపు ఐదో టెస్టు రద్దు కావడంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆవేదన వ్యక్తం చేసింది. దీని వల్ల తాము ఆర్థికంగా చాలా నష్టపోతామని చెప్పింది. ఈ మ్యాచ్ పై చర్చించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ లండన్ కు వెళ్లనున్నారు. అయితే, ఆగి పోయిన టెస్టు మ్యాచును మాత్రమే తర్వాత కొనసాగించాలని… ప్రస్తుత సిరీస్ లో భాగంగానే ఆ మ్యాచ్ జరగాలని గంగూలీ చెప్పారు. మరో సిరీస్ అంటే మాత్రం కుదరదని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్

Advertisement

తాజా వార్తలు

Advertisement