Wednesday, May 29, 2024

Record | విరాట్‌ ఖాతాలో మరో రికార్డు..

భార‌త్ స్టార్ బ్యాట్స్‌మెన్, రన్ మెషీన్.. విరాట్ కోహ్లి తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన విరాట్.. ఇప్పుడు టెస్టు క్రికెట్‌లోనూ రికార్డు సృష్టించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2019-2025లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు.

రోహిత్ శర్మను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ 57 ఇన్నింగ్స్‌ల్లో 2,101 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 42 ఇన్నింగ్స్‌ల్లో 2,097 పరుగులు చేశాడు. కోహ్లి, రోహిత్ శర్మ తర్వాత ఛెతేశ్వర్ పుజారా (62 ఇన్నింగ్స్‌ల్లో 1,769 పరుగులు) మూడో స్థానంలో నిలిచాడు. అజింక్య రహానే 49 ఇన్నింగ్స్‌ల్లో 1,589 పరుగులు, రిషబ్ పంత్ 41 ఇన్నింగ్స్‌ల్లో 1,575 పరుగులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement