Friday, April 26, 2024

ఆర్సీబీ vs ఆర్ఆర్..ఊపుమీదున్న కోహ్లీ సేన..

ఐపీఎల్ 2021 సీజన్‌లో హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ విజయాలతో అదరగొడుతున్న రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరు మరో విజయంపై కన్నేసింది. వాంఖడే మైదానం వేదికగా జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టనుంది. అటు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, ఇటు బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటుతున్న కోహ్లీ సేన బలంగా ఉంది. ఏబీ డివిలియర్స్‌‌‌‌‌‌‌‌తో పాటు కొత్త టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన గ్లెన్‌‌‌‌‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ ఓ రేంజ్‌‌‌‌‌‌‌‌లో విజృంభించడంతో ఆర్‌‌సీబీ ఫుల్‌‌‌‌‌‌‌‌ జోష్‌‌‌‌‌‌‌‌లో ఉంది. ఇద్దరూ భీకర ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా.. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో బాగానే ఆడిన విరాట్‌‌‌‌‌‌‌‌ భారీ స్కోరు బాకీ ఉన్నాడు. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరూ రాణించినా ఆర్‌సీబీకి బ్యాటింగ్‌లో తిరుగుండదు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది.

వాంఖడే మైదానం చిన్నది కావడంతో కివీస్ విధ్వంసకర ప్లేయర్ ఫిన్ అలెన్‌ను ఆడించే అవకాశం ఉంది. అప్పుడు పడిక్కల్ ఫస్ట్ డౌన్‌లో రావచ్చు. అదే జరిగితే గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన పటిదార్‌పై వేటు పడవచ్చు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఆర్‌‌‌‌‌‌‌‌సీబీకి తిరుగులేకుండాపోయింది. పేసర్లు మహ్మద్ సిరాజ్‌‌‌‌‌‌‌‌, హర్షల్‌ పటేల్‌‌‌‌‌‌‌ చాలా పొదుపుగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. కైల్ జెమీసన్ పరుగులిస్తున్నా కీలక వికెట్లు తీస్తున్నాడు. చాహల్ కూడా గాడిలో పడటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఆరంభ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ.. తర్వాత సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌, కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్‌రైడర్స్‌పై ఈజీగా విక్టరీలతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లింది. ఇదే జోరును కొనసాగిస్తూ రాజస్థాన్‌ను ఓడించాలని కోహ్లీసేన భావిస్తోంది.

మరోవైపు రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో రెండింటిలో ఓడి డీలా పడింది. శాంసన్‌పైనే ఆర్ఆర్ ఎక్కువగా ఆధారపడి ఉంది. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌ తర్వాతి రెండు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లోనూ ఫెయిలయ్యాడు. సంజూ మరోసారి చెలరేగితే రాజస్థాన్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. జోస్‌‌‌‌‌‌‌‌ బట్లర్‌‌‌‌‌‌‌‌, మిల్లర్ రాణిస్తున్నా.. ఇతర బ్యాట్స్‌మన్ విఫలమవుతున్నారు. ఆల్‌రౌండర్లు రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా రాణించాల్సిన అవసరం ఉంది. జయదేవ్ ఉనాద్కత్, చేతన్ సకారియా, క్రిస్ మోరీస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌తో బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. కానీ పరుగులిచ్చుకోవడాన్ని నియత్రించుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement