Thursday, April 25, 2024

కరోనా తో ప్రముఖ దర్శకుడు మృతి

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ మహమ్మారి బారిన సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు. అంతేకాకుండా లక్షల మంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. తాజాగా ఈ మహమ్మారి బారిన పడి శాండిల్ వుడ్ కి చెందిన ప్రముఖ పోస్టర్ డిజైనర్, దర్శకుడు మస్తాన్ తుదిశ్వాస విడిచారు. గత నలభై సంవత్సరాలుగా శాండల్ వుడ్ లో పోస్టర్ డిజైనర్ గా పనిచేస్తున్నారు మస్తాన్. 2000 సినిమాలకు పైగా పోస్టర్ డిజైనర్ గా పనిచేసిన మస్తాన్ శుక్లాంబరధరం, కళ్ళేసిమెళ్ళేసి, సితార సినిమాలకు దర్శకత్వం వహించారు.

కాగా ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం రాత్రి మృతి చెందారు. మస్తాన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement