Monday, May 6, 2024

ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నిజమెంత?

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కేసులు సంఖ్య మూడు లక్షలకుపైగా పెరిగింది. కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆర్టీపీసీఆర్( RT-PCR)ను ఫైనల్ టెస్ట్‌గా భావిస్తారు. కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తారు. ప్రస్తుతం దేశంలో కరోనా నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ టెస్ట్, రాపిడ్ యాంటీజెన్ టెస్ట్‌ అనే రెండు పద్ధతులను అవలంభిస్తున్నారు.

యాంటీబాడీ టెస్టుల్లో భాగంగా వైరస్ ను కనుగొని దానికి శరీరం ఏవిధంగా స్పందిస్తుంది అనేది ఈ పరీక్షల్లో నిర్ధారిస్తారు. ఇందు కోసం రోగీ శరీరంలోని శ్వాస మార్గం, గొంతు, ముక్కు నుంచి నమూనాలను సేకరిస్తారు. వీటి ఫలితాల కోసం 12 నుంచి 24 గంటల సమయం పడుతుంది. అయితే, ప్రస్తుతం చేస్తున్న ఆర్టీపీసీఆర్ టేస్టుల్లో ఫలితాలు కరెక్ట్ గా రావడం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆర్టీపీసీఆర్ లో వచ్చిన ఫలితాన్నే డాక్టర్లు ఫైనల్ నిర్ధారణగా తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు దాని సామర్థ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చినా, కోవిడ్-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిన వారికి హై కోవిడ్ లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్-19 కొత్త స్ట్రెయిన్లు ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో బయటపడట్లేదని అభిప్రాయాలు వ్యక్తం వినిపిస్తున్నాయి. ఆర్టీపీసీఆర్ టెస్టుల నెగిటివ్ రిపోర్టు ప్రశ్నార్థకంగా మారుతోందని పలువురు అంటున్నారు.  తెలంగాణలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా కరోనా నిర్ధారణ కాని ఒక వ్యక్తి ప్రస్తుతం ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ చూపించిన రోగులు న్యుమోనియా బారిన పడుతున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో ముక్కు నుంచి స్వాబ్ శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేస్తారు. ఆ స్వాబ్ ప్రాంతంలో వైరస్ ఉండట్లేదు కాబట్టి… ఆ టెస్టులో వైరస్ లేనట్లుగా చూపిస్తోంది. ఆర్టీపీసీఆర్ టెస్టు కచ్చితత్వం 70 శాతం మాత్రమే అని అంటున్నారు. కొన్నిసార్లు నమూనాల సేకరణ సరిగా చేయకపోవడం, టెస్టింగ్‌ వైఫల్యాల వల్ల కూడా ఇలా జరగవచ్చని చెబుతున్నారు. అందువల్ల లక్షణాలు ఉండి కూడా ఈ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన వారు వైరస్ నిర్ధారణ కోసం వెంటనే సిటీ స్కాన్ చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ రిపోర్ట్ వస్తే… కొన్ని రోజుల తరువాత సిటీ స్కాన్ చేయించుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఆర్టీపీసీఆర్‌తో పాటు సిటీ స్కాన్‌ కూడా వెంటనే చేయించుకోవాలని సిఫారసు చేస్తున్నారు. దీనివల్ల సాధ్యమైనంత త్వరగా వైరస్‌ను గుర్తించి రోగులకు చికిత్స అందించవచ్చని వైద్యులు చెబుతున్నారు.  

- Advertisement -

మరోవైపు ఆర్టీపీసీఆర్ పరీక్షలు ల్యాబ్స్ లో ఉచితం అయినప్పటికీ, ప్రైవేటు ల్యాబ్ లు వీటి కోసం వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎంత మేర ప్రభావంతంగా పని చేస్తాయనేది రోగి వైరస్ బారిన పడిన సమయం నుంచి అతడిలో వైరస్ తీవ్రత, ఆవ్యక్తి నుంఇచ సేకరించిన నమూనాలు నాణ్యత, వాటిని ఏ విధంగా ప్రాసెస్ చేశారు, పరీక్షలకు ఉపయోగించే కిట్లలోని కచ్చితత్వం వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement