Wednesday, May 22, 2024

సౌర‌వ్ గంగూలీకి జెడ్ కేట‌గిరి.. నిర్ణ‌యించిన వెస్ట్ బెంగాల్ స‌ర్కార్

బిసిసిఐ మాజీ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీకి జెడ్ కేట‌గిరి భ‌ద్ర‌త ఇవ్వాల‌ని ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.కాగా ఆయనకి ఇచ్చిన వై కేటగిరి భద్రత కాలం ఇటీవలే ముగిసిందని ఓ అధికారి తెలిపారు. అనంతరం దీనిపై నిబంధనల ప్రకారం రివ్యూ చేసి ఆయనకి జెడ్ కేటగిరి భద్రత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరిపాలన స్థాయిలో చర్చల అనంతరం బెంగాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గంగూలికి జెడ్ కేటగిరి భద్రత అందుబాటులోకి రాగానే కోల్ క‌త్తాలోని బెహలా ప్రాంతంలో గల ఆయన ఇంటి వద్ద ఇప్పుడు 24 గంటలపాటు ఇద్దరు ప్రత్యేక భద్రత అధికారులు కాపలాగా ఉండనున్నారట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement