Sunday, April 28, 2024

క్వార్టేన్‌ గేమ్స్‌లో నీరజ్‌కు స్వర్ణం

టోక్యో ఒలింపిక్స్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా మరో స్వర్ణం పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిన్‌లాండ్‌ వేదికగా జరిగిన క్వార్టేన్‌ గేమ్స్‌లో నీరజ్‌ చోప్రా తొలి ప్రయత్నంలోనే 86.69 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరి పసిడి పతకం సాధించాడు. ట్రినిడాడ్‌- టొబాగోకు చెందిన కెషోర్న్‌ వాల్కాట్‌, గ్రెనడాకు చెందిన ప్రపంచ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ను దాటుకొని నీరజ్‌ చోప్రా మొదటి స్థానంలో నిలిచాడు. ఇటీవలే సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన చోప్రా, తన 86.69 మీటర్ల త్రోతో అందరినీ ఆశ్చర్చపరిచాడు.

వాల్కాట్‌ 86.64 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలవగా, పీటర్స్‌ 84.75 ఉత్తమ ప్రయత్నంతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరో భారత క్రీడాకారుడు, ప్రపంచపారి జావెలిన్‌ చాంపియన్‌ సందీప్‌ చౌదరి 60.35 మీటర్ల బెస్ట్‌ త్రోతో 8వ స్థానంలో నిలిచాడు. అథ్లెటిక్స్‌లో నీరజ్‌ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డుకెక్కాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement