Friday, March 29, 2024

యుద్ధ క్షేత్రానికి జెలెన్‌స్కీ.. సైనికులతో మాటామంతీ..

తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా విరుచుకుపడుతూండగా దక్షిణ ఉక్రెయిన్‌లో వారి సేనలను తరిమికొట్టేందుకు ఉక్రెయిన్‌ సేనలు హోరాహోరీ పోరాడుతున్నాయి. కాగా సైన్యంలో నైతికంగా బలోపేతం చేసేందుకు, ధైర్యం నూరిపోసేందుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కీవ్‌కు 550 కి.మి దూరంలోని మికోలెయివ్‌ యుద్ధక్షేత్రంలో పర్యటించారు. సైనికులతో ముచ్చటించారు. సాహసవీరులకు పతకాలు ప్రదానం చేసారు.

వారితో కలసి సెల్పీలు తీసుకున్నారు. నల్లసముద్రంలోని కీలక నౌకా నగరమైన ఒడెస్సాను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తుండగా కీవ్‌ సేనలు ప్రతఘటిస్తున్నాయి. సైనికులే కాదు మహిళలు, యువత సహా ప్రతి ఒక్కరూ రష్యాను ఓడించేందుకు పోరాడుతున్నారని, విజయం తధ్యమని జెలెన్‌స్కీ ప్రకటించారు. మా దక్షిణ ఉక్రెయిన్‌లోని ఏ ఒక్క ప్రాంతాన్ని శత్రువులకు అప్పగించబోమని ప్రతినబూనారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement