Saturday, April 27, 2024

Breaking: జోరు త‌గ్గిన‌ ల‌క్నో.. పంజాబ్‌కు 154 ప‌రుగుల టార్గెట్‌

పంజాబ్ కింగ్స్ తో జ‌రుగుతున్న‌ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 46, దీపక్ హుడా 34 ప‌రుగుల‌తో రాణించారు. ఆఖర్లో చమీర 17, మొహిసిన్ ఖాన్ 13(నాటౌట్), జాసన్ హోల్డర్ 11 పరుగులు చేయడంతో లక్నో జట్టుకు ఆమాత్రం స్కోరైనా వచ్చింది. కాగా, పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడా 4 వికెట్లతో లక్నో జట్టును హడలెత్తించాడు. రాహుల్ చహర్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఆరంభంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ (6) స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో లక్నో భారీ స్కోరు ఆశలను దెబ్బతీసింది. కృనాల్ పాండ్య (7), మార్కస్ స్టొయినిస్ (1) విఫలమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement