Tuesday, May 7, 2024

బొగ్గు కటకట, దేశ వ్యాప్తంగా నిల్వలు నిల్‌.. నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

దేశ వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. వేడి పెరగడంతో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. అనేక రాష్ట్రాలు విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చలేకపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న చాలా నగరాల్లో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటేసింది. ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, బీహార్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, పంజాబ్‌, హర్యానాలలో వేసవి ప్రారంభం నుంచే విద్యుత్‌ కోతలు ప్రారంభం అయ్యాయి. బొగ్గు గనులు ఉన్న ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో కూడా విద్యుత్‌ కోతలు తప్పడం లేదు. జార్ఖండ్‌ ప్రభుతం యాజమాన్యంలోని పవర్‌ తెనుఘాట్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో కేవలం 17.6 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉంది. బొగ్గు కొరత ఎదుర్కొంటున్న మహారాష్ట్ర కూడా వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా తాత్కాలికంగా తగ్గించినట్టు తెలుస్తున్నది. అయినా విద్యుత్‌ కోతల్లేవని తేల్చి చెప్పింది. గుజరాత్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలు ప్రభుత రంగ సంస్థలను ఖరీదైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు అనుమతించడంతో కోతలు తగ్గుతున్నాయి.

రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌..

పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ కారణంగా దేశంలో పలు నగరాలు లోడ్‌ షెడ్డింగ్‌ను ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్‌ 26న దేశ పవర్‌ గ్రిడ్‌ 201 గిగా వాట్స్‌ రికార్డు డిమాండ్‌ను ఎదుర్కొంది. అంతకుముందు 2021 జులై 7న 200 గిగా వాట్స్‌ డిమాండే ఇప్పటి వరకు అత్యధికం. అయితే విద్యుత్‌ డిమాండ్‌ క్రమంగా పెరుగుతూ వచ్చింది. మార్చి మధ్య నుంచి గ్రిడ్లు 195 గిగా వాట్స్‌ పైన డిమాండ్‌ ఎదుర్కొన్నాయి. ఇళ్లలో ఏసీల వినియోగం పెరగడంతో.. మార్చి, ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలో అసాధారణ పెరుగుదల కనిపిస్తోంది. ఉష్ణోగ్రత పెరగడంతో.. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రిక్‌ ఫ్యాన్లు వంటి వాటి ఉపయోగం పెరిగింది. వాణిజ్యపరంగా కూడా విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగింది. లోడ్‌ షెడ్డింగ్‌ వెనుక ప్రధాన కారణం బొగ్గు కొరత. పవర్‌ గ్రిడ్‌ ద్వారా నడుస్తున్న మొత్తం విద్యుత్లో దాదాపు 75 శాతం బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement