Friday, April 26, 2024

మెగాస్టార్​ చిరంజీవితో మంత్రి రోజా భేటీ.. ఇవిగో ఫొటోలు..

ఆంధ్రప్రదేశ్​ క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం శాఖ మంత్రి ఆర్​కే రోజా ఇవ్వాల (శుక్రవారం) హైదరాబాదులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి.. ఆయన భార్య సురేఖ… మంత్రి రోజాతోపాటు ఆమె భర్త సెల్వమణిని, పిల్లలను సాదరంగా ఆహ్వానించారు. కాగా, ఆచార్య విడుదల సందర్భంగా రోజా శుభాకాంక్షలు తెలుపగా.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజాను చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా రోజాకు చిరు శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు రోజా తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలవడం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement