Saturday, April 27, 2024

IND vs AUS | ఆసీస్‌తో టెస్టు సిరీస్‌.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే !

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆసీస్ గడ్డపై ఐదు టెస్టు సిరీస్‌లు జరగనున్నాయి. కాగా, ఈ టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (మంగళవారం) వెల్లడించింది. సిరీస్‌లో తొలి టెస్టు నవంబర్ 22న పెర్త్‌లో ప్రారంభం కానుంది.

నవంబర్ 22-26 తేదీల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు జరగనుండగా.. డిసెంబర్ 6-10 తేదీల మధ్య అడిలైడ్ వేదికగా రెండో టెస్టు జరగనుంది. డిసెంబర్ 14న బ్రిస్బే్న్‌లోని గబ్బా వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. డిసెంబర్ 26న మొదలయ్యే బాక్సింగ్ డే టెస్ట్‌కు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2025 జనవరి 3న సిడ్నీ వేదికగా చివరి టెస్టు ప్రారంభం కానుంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్‌ కీలకమైన ఈ సిరీస్ సిడ్నీ టెస్టుతో ముగియనుంది.

తొలి టెస్టు నవంబర్ 22-26 మధ్య పెర్త్‌లో జరగనుండగా, రెండో టెస్టు డిసెంబర్ 6-10 మధ్య అడిలైడ్‌లో జరగనుంది. మూడో టెస్టు డిసెంబర్ 14న బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ప్రారంభం కానుంది. డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్‌కు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. చివరి టెస్టు జనవరి 3, 2025న సిడ్నీలో ప్రారంభమవుతుంది. ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ సైకిల్‌లోని ఈ కీలక సిరీస్ సిడ్నీ టెస్ట్‌తో ముగుస్తుంది.

ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల జట్టు..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతున్న సమయంలోనే భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆడనుంది. కాగా, ఈ సిరీస్‌లో తొలి వన్డే డిసెంబర్ 5న జరగనుండగా, రెండో మ్యాచ్ డిసెంబర్ 8న, మూడో మ్యాచ్ డిసెంబర్ 11న జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement