Saturday, April 27, 2024

Ta‌bu : సోఫాలో చిరుత…

రెండేళ్ల‌గా సీనియ‌ర్ బ్యూటీ ట‌బు కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. 50 ఏళ్ల వ‌య‌సులోనూ ట‌బు స‌త్తా చాటుతుంది. స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతూనే హాట్ పాత్ర‌ల్లోనూ న‌టిస్తోంది. 50 ఏళ్ల వ‌య‌సులోనూ ట‌బు రొమాంటిక్ ఇమేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తుంది. కుర్ర హీరోల‌తో ఘాటైన రొమాంటిక్ స‌న్నివేశాల్లో త‌న‌దైన మార్క్ వేస్తోంది.

పాత్ర‌ని బ‌ట్టి ట‌బు త‌న‌ని తాను మౌల్డ్ చేసుకుంటూ న‌వ‌త‌రం భామ‌ల‌కు ధీటుగా అవ‌కాశాలు అందుకుంటుంది ఖూఫియా..బోళా లాంటి చిత్రాల్లో అమ్మ‌డు ఏ రేంజ్ పెర్పార్మెన్స్ చేసిందో తెలిసిందే. ఇక ది క్రూలో అంత‌కు మించి హాట్ గా అల‌రించ‌డానికి సిద్ద‌మైంది. ఇప్ప‌టికే క్రూలో టబు ఘాటు ఫోజులు నెట్టింట ఏ రేంజ్ లో వైర‌ల్ అవుతున్నాయో క‌నిపిస్తూనే ఉంది. ప్ర‌యాణికుల్ని అందం అనే ఎర‌తో బురిడి కొట్టించ బోతుంది. ప‌క్క‌నే క‌రీనా క‌పూర్…కృతిస‌న‌న్ లాంటి బ్యూటీలు ఉన్నా వాళ్ల‌ను మించిన బ్యూటీతో ట‌బు హైలైట్ అవుతుంది.

- Advertisement -

ఇదిగో ఒక్క‌డ చిరుత పులి డిజైన్ దుస్తుల్లో సెగ‌లు పుట్టించే భంగిమ‌తో నెట్టింట్లోకి వ‌చ్చేసింది. న‌వ నాయిక‌ల్ని మించి అమ్మ‌డు త‌న‌లో వేడితో దాడి చేస్తుంది. సోఫాలో ట‌బు అలా వ‌య్యారంగా ప‌డుకుని కిల్ల‌ర్ లుక్ లో క‌వ్వించేస్తోన్న వైనానికి ఫిదా కాని దెవ‌రు. మ్యాడమ్ లో ఆ వేడి ఏమాత్రం త‌గ్గ‌లేదన‌డానికి ఇదొక మ‌చ్చు తున‌క లాంటిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement