Friday, May 3, 2024

T20 World Cup :బ్రాండ్ అంబాసిడ‌ర్ గా య‌వ‌రాజ్ సింగ్ ..

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి (ఐసీసీ) కీలక బాధ్య తలు అప్పజెప్పింది. త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌- 2024కు యూవీని అంబాసిడర్‌గా ఎంపికా చేసింది. వెస్టిండీస్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌ను ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే అమెరికాలో జరిగే అన్ని మ్యాచ్‌ల ప్రమోషన్‌ ఈవెంట్లలో యువరాజ్‌ పాల్గొననున్నాడు. టోర్నీ హైవోల్టేజ్‌ భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ కూడా యూఏస్‌ఏ వేదికగానే జరగనుంది. ఈ మ్యాచ్‌తో పాటు అక్కడ జరిగే అన్ని మ్యాచ్‌లకూ యూవీ రాయబారిగా వ్యవహరించనున్నాడు.

- Advertisement -

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై యువరాజ్‌ సింగ్‌ స్పందిస్తూ.. టీ20 ప్రపంచకప్‌తో ఎన్నో ముధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్‌లోనే ఆరు బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేయడం ఎప్పటికీ గుర్తిండి పోతుంది. అలాంటి మెగా టోర్నీలో మరోసారి భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచకప్‌ అంబాసిడర్‌గా బాధ్యతలు నిర్వర్తించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. అలాగే భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఈ టోర్నీకే హైలైట్‌. ఈ ప్రపంచకప్‌లో జరగబోయే అతిపెద్ద క్రీడా సంగ్రామమంగా భారత్‌- పాక్‌ మ్యాచ్‌ నిలవనుంది అని యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు.

కాగా, జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను నాలుగు గ్రూపుల్లో విభజించారు. గ్రూప్‌-ఏలో భారత్‌తో పాటు పాకిస్తాన్‌, కెనడా, అమెరికా, ఐర్లాండ్‌ జట్లు పోటీ పడుతున్నాయి. జూన్‌ 5న జరిగే తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా పసికూన ఐర్లాండ్‌తో తలపడనుంది. జూన్‌ 9న దాయాదుల పోరు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ న్యూయార్క్‌ వేదికగా జరగనుంది. యువరాజ్‌ సింగ్‌తో పాటు వెస్టిండీస్‌ మాజీ దిగ్గజం యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌, జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ కూడా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు అంబాసిడర్లుగా ఎంపికయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement