Thursday, May 9, 2024

రెజ్లింగ్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు…

కజక స్థాన్‌లోని అల్మటీ వేదికగా జరిగిన యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాంకింగ్‌ సిరీస్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు లభించాయి. రియో ఒలింపిక్స్‌ పతక విజేత సాక్షి మాలిక్‌ ఈ టోర్నీలో అదరగొట్టింది. బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. శుక్రవారంనాడు మహిళల 62 కేజీల విభాగంలో ఆతిథ్య కజకస్థాన్‌కు చెందిన ఇరినా కుజ్నెట్సోవాపై 7-4 తేడాతో సాక్షి మాలిక్‌ గెలుపొందింది. స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 57 కేజీల విభాగంలో మాన్సి కజకస్థాన్‌కు చెందిన ఎమ్మా టిస్సీనాపై 3-0తో విజయం సాధించగా, 68 కేజీల కేటగిరీలో దివ్య స్వర్ణం దక్కించుకుంది.

మంగోలియాకు చెందిన దెల్గెర్మా ఎన్ఖసయిఖాన్‌, కజకస్థాన్‌కు చెందిన అల్బినాలపై గెలిచింది. అయితే ఫైనల్‌ బౌట్‌లో మంగోలియాకు చెందిన బొలోర్‌టుంగలాగ్‌ చేతిలో 10-14 తేడాతో ఓడిపోయింది. కానీ మొత్తంగా దివ్య ఖాతాలో ఎక్కువ విజయాలు ఉండటం వల్ల ఆమెను విజేతగా ప్రకటించారు. గురువారంనాడు జరిగిన మ్యాచ్‌లో రెజ్లర్‌ నీరజ్‌ కాంస్యం గెలుచుకున్న సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement