Monday, May 20, 2024

SRH vs LSG | వార్ వ‌న్ సైడ్.. ల‌క్నో పై హైదరాబాద్ ఘన విజయం

ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జేయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్‌.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 9.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నోను ను హైద‌రాబాద్ బౌలర్లు 165 కే ప‌రుగుల‌కే ప‌రిమితం చేయగా.. ఛేజింగ్‌లో బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ ( 75 నాటౌట్), ట్రావిస్ హెడ్(89 నాటౌట్) బౌండరీల మోత మోగించారు. సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించారు. ఇక ఈ విజయంతో 14 పాయింట్లతో మరోసారి మూడవ స్థానికి చేరుకుంది హైదరాబాద్ జట్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement