Sunday, April 28, 2024

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: టాప్‌లోకి కేన్ విలియ‌మ్స‌న్..

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో కేన్ విలియమ్సన్ తిరిగి నంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఆసీస్ బ్యాట్స్‌మ‌న్ స్టీవ్ స్మిత్‌ను వెన‌క్కి నెట్టి నంబ‌ర్ వ‌న్‌గా నిలిచాడు. ఫైన‌ల్ లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి విలియమ్సన్ 49, 52 ప‌రుగులు చేశాడు. దీంతో 901 పాయింట్ల‌తో టాప్ ర్యాంకులోకి దూసుకెళ్లాడు. స్మిత్ 891 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నాలుగో స్థానంలోనే కొన‌సాగుతున్నాడు.

ఇది కూడా చదవండి: WTC 2 షెడ్యూలు, పాయింట్ల వివరాలు ప్రకటించిన ఐసీసీ

Advertisement

తాజా వార్తలు

Advertisement