Tuesday, April 30, 2024

ఆ ఫైట్ సినిమాకే హైలెట్ !!

దర్శక ధీరుడు రాజమౌళి… యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్ కనిపించబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ల్ ఈ సినిమాలో ఓ రైన్ ఫైట్ ఉంటుందని ఈ సినిమాకే హైలెట్ గా ఆ ఫైట్ నిలుస్తుందని తెలుస్తోంది. ఇద్దరి మధ్య వచ్చే పోరాట సన్నివేశం సినిమా ఫస్ట్ హాఫ్ లో వస్తుందట.

ఇక ఈ సినిమాలు వేరు వేరు లక్ష్యాలు ఉన్న ఈ ఇద్దరు హీరోలు స్నేహితులుగా మరి ఒకే లక్ష్యం కోసం పోరాటం చేస్తారట. ఇక ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా… అజయ్ దేవగన్ శ్రీయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement