Wednesday, June 5, 2024

MDK: బీఆర్ఎస్ అభ్యర్థికి బుద్ధి చెప్పాలి.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు..

మెద‌క్ : భూములు లాక్కొని, పేదలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఎన్నికలలో బుద్ధి చెప్పాలని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపూర్ నుండి తొగరపల్లి శివాజీ సెంటర్ వరకు తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్, డీసీసీ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఎంపీ అభ్యర్థి నీలం మధు రోడ్ షో నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రసంగిస్తున్న చోటుకి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రచార వాహనం చేరుకుంది.

దీంతో నీలం మధు ఆయా ప్రచార వాహనాన్ని చూపిస్తూ.. కలెక్టర్ గా ఉన్న సమయంలో వెంకట్రామిరెడ్డి రైతులకు చేసిన అన్యాయాలను వివరించారు. ఇలాంటి దుర్మార్గుడికి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చిందని, ఇలాంటి వ్యక్తికి ఓటు ఎలా వేస్తారో? ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే గత పాలకులు యువతకు ఉద్యోగాల పేరిట మోసం చేశారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికలలో యువత ఒక్కసారి ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈ ఏన్ఎస్ యుఐ శివారెడ్డి, ఎంపీపీ మనోజ్ రెడ్డి, మండల అధ్యక్షులు ప్రభు, పిఎసిఎస్ చైర్మన్ శ్రీకాంత్, లక్ష్మారెడ్డి, సుమ, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement