Saturday, May 4, 2024

Asia Championships | పురుషుల జట్టుకు పరాభవం.. చైనా చేతిలో ఓటమి

ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత పురుషుల జట్టు చైనా చేతిలో పరాభవం ఎదురైంది. తొలి రోజు హాంకాంగ్‌ను 4-1తో చిత్తు చేసిన భారత పురుషుల జట్టు రెండో రోజు మాత్రం పటిష్టమైన చైనా చేతిలో 2-3తో ఓవటమిపాలైంది. గురువారం జరిగిన టీమ్‌ ఈవెంట్‌లో వరుసగా తొలి రెండు సింగిల్స్‌ విజయాలతో భారత ఆటగాళ్లు మంచి ఆరంభాన్ని అందించారు.

కానీ ఆ తర్వాత వరుసగా రెండు డబుల్స్‌, ఒక సింగిల్స్‌లో ఓటమి ఎదురైంది. తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో భారత స్టార్‌ ప్రపంచ 8వ ర్యాంకర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ విజయం సాధించగా.. రెండో సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ సునాయసంగా గెలిచి భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. తర్వాత డబుల్స్‌లో అర్జున్‌-దృవ్‌ కపీల్‌ జోడీ, సూరజ్‌-పృథ్వీ కృష్ణమూర్తి ద్వయం చైనా ఆటగాళ్ల చేతిలో ఓటమి పాలయ్యారు. దాంతో స్కోరు 2-2తో సమమైంది.

ఆ తర్వాత నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లో జాతీయ చాంప్‌ చిరాగ్‌ సేన కూడా ఓడిపోవడంతో చైనా 3-2తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కాగా, ఇప్పటికే భారత్‌, చైనా నాకౌట్‌కు అర్హత సాధించాయి. గ్రూప్‌లో చైనా టాప్‌లో నిలవగా.. భారత్‌ రెండో స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement