Friday, May 3, 2024

TS – మాది వాస్తవిక బడ్జెట్ – డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్ – బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి రూపాయిలో సమానత్వం పాటించామన్నారు భట్టి …. తెలంగాణలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయని, అసమానతలను రూపుమాపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు .తెలంగాణ బడ్జెట్‌పై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. గత ప్రభుత్వం రాబడులను అంచనా వేయకుండా బడ్జెట్ రూపొందించిందని ఆరోపించారు.

తమ ప్రభుత్వం చాలా సహేతుకంగా బడ్జెట్ రూపొందించామని చెప్పారు .. గతంలో ఆదాయం ఉన్నా.లేకున్నా.బడ్జెట్‌ను పెంచుకుంటూ వెళ్లారని, గత పదేళ్లలో సరైన బడ్జెట్‌ను రూపొందించలేదని అన్నారు. ప్రతి ఏడాది ఒక్కో అంశంపై 20 శాతం కేటాయింపులు పెంచుతూ వెళ్లారని అన్నారాయన.

తెలంగాణ రాష్ట్రంలో సమాన అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు భట్టి విక్రమార్క… . దళిత బంధు ఇవ్వడానికి తమ ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదని, కాంగ్రెస్ పార్టీ కూడా దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తోందన్నారాయన.. జాబ్ క్యాలెండర్ విడదల చేస్తామన్నారు భట్టి.. ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని, ధరణి వెబ్ సైట్ ను ప్రక్షాళన చేస్తామని, ఆ తరువాతే ధరణిలో ఏర్పడిన లోపాలను సరిదిద్ది.. రైతులకు న్యాయం చేస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి ..

Advertisement

తాజా వార్తలు

Advertisement