Saturday, May 18, 2024

TS | మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మంత్రి దామోదర రాజనరసింహ

మెదక్ ప్రతినిధి, ప్రభ న్యూస్ : మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావులతో కలిసి మెదక్ జిల్లా కేంద్రంలో రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ”షీ” టీమ్ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీజింగ్‌కు గురైన మహిళలలు, అమ్మాయిలు, పిల్లలు లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిలకు, మహిళలకు, అత్తింటివారి ఆగడల బారిన పడిన మహిళలు, గృహహింసకు గురైన మహిళల కోసం భరోసా కేంద్రంలో మహిళ రక్షణ కల్పిస్తూ రాత్రి నిద్రించేందుకు వసతి కోసం ఈ కేంద్రం పని చేస్తుందని తెలిపారు. కౌన్సిలింగ్ కోసం, న్యాయ సహాయం కోసం, అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించడం కోసం ఆధునిక హంగులతో నూతన భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.

2022 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 135 కేసులు నమోదు అయ్యాయని, వారికి సుమారు రూ.27 లక్షల పైచిలుకు ఆర్థిక సహాయం చేశామన్నారు. కేసు నమోదు అయినప్పుడు ఆర్థిక సహాయం చేయలన్నారు. చివరగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు సంపూర్ణ ఆర్థిక మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. భరోసా కేంద్రంలో శారీరకంగా, మానసికంగా, లైంగికంగా సమాజంలో వేధింపులకు గురైన, అత్యాచారాలకు గురైన బాధితులకు తక్షణం అండగా నిలిచేందుకు, పోక్సో కేసులలో మహిళలకు, పిల్లలకు స్వాంతన చేకూర్చడానికి కౌన్సిలింగ్, రిహాబీలేషన్ సెంటర్‌గా ఈ భరోసా కేంద్రం ద్వారా పోలీసులు, మానసిక కౌన్సిలింగ్ నిపుణులు ద్వారా బాధిత మహిళలకు, పిల్లలకు అండగా నిలిచేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు.

- Advertisement -

బాధిత మహిళలకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తాయని అన్నారు. మానసిక వేదనకు గురి కాకుండా కాపాడే విధంగా ఈ భరోసా సెంటర్ పని చేస్తుందని తెలిపారు. భరోసా కేంద్రాలు లేని జిల్లాలో త్వరలో ఏర్పాటు చేస్తాం అన్నారు. భరోసా కేంద్రంలో మంత్రివర్యులు మొక్కను నాటారు. జిల్లా పోలీస్ శాఖ గ్లాండ్ ఫార్మా లు సిఎస్ఆర్ నిధులతో ఈ భరోసా కేంద్రాన్ని నిర్మించాయి. ఈ కార్యక్రమంలో డీఐజీ రెమా రాజేశ్వరీ, జిల్లా ఎస్‌పీ బాలస్వామి, డీఏం‌హెచ్‌ఓ చందు నాయక్, జిల్లా సంక్షేమాధికారిణి బ్రహ్మాజీ, స్థానిక, మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్‌, గ్లాండ్ ఫార్మ ప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement