Saturday, April 27, 2024

వీడియో: ఓడిపోతున్నానన్న కోపంతో చెవికొరికిన బాక్సర్..

మ్యాచ్ లో ఓడిపోతున్నన్న కోపంతో ప్రత్యర్థి చెవికొరికాడు ఓ బాక్సర్.. మొరాకొకు చెందిన బాక్సర్‌ యూనెస్‌ బాల్లా.. న్యూజిలాండ్‌ బాక్సర్‌ డేవిడ్‌ న్యీకా చెవి కొరికాడు. బాక్సింగ్‌లో హెవీ వెయిట్‌ విభాగంలో మొరాకొకు చెందిన బాక్సర్‌ యూనెస్‌, న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్‌ నికా మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్‌ 5-0 తేడాతో యూనీస్‌ను ఓడించాడు. బౌట్‌లో డేవిడ్‌ నికా తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించగా.. యూనెస్‌ తేలిపోయాడు. మ్యాచ్‌లో ఓడిపోతున్నాననే అసహనంతో మూడో రౌండ్‌లో డేవిడ్‌ చెవి కొరకడానికి యత్నించాడు. యూనీస్‌ దంతాలు తగలగానే డేవిడ్‌ అతడిని దూరంగా నెట్టేశాడు. కాగా, యూనెస్‌ అనుచిత ప్రవర్తనతో ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ అతడిని అనర్హుడిగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. గతంలో మైక్ టైసన్ కూడా ప్రత్యర్థి చెవికొరికి వార్తల్లో నిలిచాడు.

https://twitter.com/ben_damon/status/1419879557524381696
Advertisement

తాజా వార్తలు

Advertisement