Wednesday, May 29, 2024

Ashwin : ఐపిఎల్ లో భారీ స్కోర్ లు… బ్యాట‌ర్స్ నైపుణ్య‌మేనంటున్న అశ్విన్

ఈసారి ఐపీఎల్‌లో భారీ స్కోర్లు నమోదవడానికి, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనకు సంబంధం లేదని రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. స్కోర్లు పెరగడంలో బ్యాటర్ల నైపుణ్యానిదే కీలక పాత్రని అతనన్నాడు. ఈ ఐపీఎల్‌లో ఏకంగా 41 సార్లు స్కోరు 200 దాటగా.. సన్‌రైజర్స్‌ జట్టు 287 పరుగులతో అత్యధిక స్కోరు రికార్డు నెలకొల్పింది. ”ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన లేకపోయినా ఇలాగే భారీ స్కోర్లు నమోదయ్యేవి.

- Advertisement -

బ్యాటర్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. నైపుణ్యాలు పెరిగాయి. అదే సమయంలో పిచ్‌లు కూడా వారికి సహకరించాయి. ఇందుకు తగ్గట్లుగా బౌలరు కూడా నైపుణ్యాలు పెంచుకోవాలి. భవిష్యత్తులో బౌలర్లు కూడా హిట్టర్లుగా తయారవ్వాల్సి ఉంటుంది. ఎంత బాగా బౌలింగ్‌ చేసినా, బ్యాటింగ్‌లో కూడా రాణించాల్సిందే. క్రికెట్‌ ఆ దిశగానే అడుగులు వేస్తోంది” అని అశ్విన్‌ అన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement