Sunday, June 23, 2024

HYD: జూన్ 7 నుంచి హైదరాబాద్‌లో ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 

హైద‌రాబాద్: కళా ప్రియులైన హైదరాబాద్ వాసులను అలరించేలా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ప్రతి ఏటా ముంబై, బెంగళూర్ లో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు. అద్భుతమైన, అదురైన వందలాది కళాఖండాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్ లో అలరించనున్నాయి.

 కింగ్స్ కోహినూర్ (క్రౌన్) కన్వెన్షన్‌లో, పిల్లర్ 68, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే, రేతి బౌలి, హైదరాబాద్‌లో మూడురోజుల పాటు నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ లో దేశం నలు మూలల నుంచి దాదాపు 250 మంది ప్రముఖ కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీల యాజమానులు పాల్గొంటున్నారు. జూన్ 7న ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 9వ తేదీతో ముగుస్తుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు కొనసాగుతుంది.

ఈసంద‌ర్భంగా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ డైరెక్టర్ రాజేంద్ర మాట్లాడుతూ… ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ 2011లో ప్రారంభించి ఇప్పటి వరకు న్యూ ఢిల్లీ, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ప్రతి ఏటా ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 25 ఫెస్టివల్ ను విజయవంతంగా నిర్వహించామన్నారు. విశేష చారిత్రక, సాంస్కృతిక చరిత్ర ఉన్న హైదరాబాద్ లో మొదటి సారి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

ఈ ఫెస్టివల్ లో గ్యాలరీ ఎగ్జిబిట్‌లు, ఇండిపెండెంట్ కళాకారుల ప్రదర్శనలు ఉంటాయన్నారు. విభిన్నమైన కళాఖండాలును కళా ప్రియులకు అందించడానికి, కళాకారుల మధ్య నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసి వారి పెంయింటింగ్స్ కు మార్కెట్ కల్పించడానికి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ కృషి చేస్తుందని రాజేంద్ర తెలిపారు. ఒకేచోట ప్రముఖ కళాకారులు వేసిన చిత్రాలు, కళాకృతులు లభిస్తాయని, కళా ప్రేమికులకు ఇది మంచి అవకాశమ‌ని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement