Saturday, June 22, 2024

HYD: సాంప్రదాయ వంట పాత్రల కోసం గోల్డ్ డ్రాప్ గైడ్…

హైద‌రాబాద్ : విభిన్న రుచులు, సువాసనల సమ్మేళనం, తెలంగాణ వంటకాలు. విభిన్నమైన పదార్థాలకు మించి సాంప్రదాయ పాత్రల రహస్య ప్రపంచమూ ఇక్కడ ఉంది. ఈ మహోన్నతమైన రుచుల రూప కల్పనలో ప్రతి ఒక్కటీ కీలక పాత్ర పోషిస్తాయి. గోల్డ్ డ్రాప్ గైడ్‌తో తెలంగాణ మహోన్నత వారసత్వాన్ని పరిశోధిద్దాం. ఇందులో మొద‌టిది రాతి చిప్ప‌, రెండ‌వ‌ది ఉరులి, మూడ‌వ‌ది మురుక్కు అచ్చు, నాల్గ‌వ‌ది అటుకుల్, ఐద‌వ‌ది మ‌త్తి ప‌త్ర‌, ఆర‌వ‌ది దిమ్యాజిక్ ఆఫ్ కాస్ట్ ఐరన్. రాతి చిప్ప పాత్రను కల్ చట్టి అని కూడా పిలుస్తారు. తెలంగాణ వంటశాలలలో అసలైన మల్టీ టాస్కర్ ఇది. ఉరులి ఒక గుండ్రని వంట పాత్ర ఇది.

కేరళలోని నైపుణ్యం కలిగిన కళాకారులచే ఫుడ్-గ్రేడ్ ఇత్తడితో రూపొందించబడిన ఈ పాత్ర కడాయి కార్యాచరణతో హండి అందాన్ని మిళితం చేస్తుంది. వివిధ రకాల వంటకాలకు అనువైనది ఈ ఉరులి. మురుక్కు అచ్చుతో కరకరలాడే మురుక్కు లేదా జంతికలు కోసం తప్పనిసరిగా ఉండవలసిన సాధారణ సాధనం. చిన్న జాలిస్‌లో దీని రహస్యం దాగి ఉంది. అట్టుకల్ ను భారతదేశం అంతటా సిల్ బత్తా, కల్ బత్తా వంటి విభిన్న పేర్లతో పిలువబడే ఈ గ్రౌండింగ్ రాయి మొత్తం మసాలాలు, ధాన్యాలు, పప్పులను సువాసనగల పేస్ట్‌లు, పౌడర్‌లుగా మారుస్తుంది.

మత్తి పత్ర సహజమైన మట్టితో రూపొందించిన ఈ సంప్రదాయ కుండ, కోడి కూర (ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ) చేయడానికి సరైనది. ది మ్యాజిక్ ఆఫ్ కాస్ట్ ఐరన్ కాస్ట్ ఐరన్ తో చేసిన వంటసామానుతో కూడా తెలంగాణ వంటకాలు వండుతారు. ఈ దృఢమైన కుండలు, పాన్స్ సన్నగా దోసెలు, మీ నోటిలో కరిగిపోయే హల్వా, గుంట పొంగడాలు వంటి వాటికి అనుకూలం. ఈ సంద‌ర్భంగా గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ… మట్టి కుండల నుండి వాటి మట్టి సువాసనలతో రుచులను నింపే ఇనుప పాత్రల వరకు సాంప్రదాయ తెలంగాణ వంట పాత్రలు ప్రతి వంటకానికి ప్రామాణికతను జోడిస్తాయని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement