Friday, June 14, 2024

TS: మాపై కేసులా… ఆర్టీసీ ఎండీ, డీజీపీని నిల‌దీసిన కేటీఆర్

ఆర్టీసీ కొత్త లోగో షేర్ తో ప‌లువురు
బీఆర్ఎస్ నేత‌ల‌పై కేసులు న‌మోదు
దీనిపై కేటీఆర్ సీరియ‌స్
ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేసే కాంగ్రెస్ పై
ఎందుకు కేసులు పెట్ట‌లేద‌ని ప్ర‌శ్న‌
న్యాయం కోసం ఇద్ద‌ర్ని కోర్టుకు లాగుతామ‌ని హెచ్చరిక

టీఎస్ ఆర్టీసీ కొత్త లోగో ప్ర‌చారం విష‌యంలో బీఆర్ఎస్ నాయ‌కులు, మ‌ద్ద‌తుదారుల‌పై కేసులు న‌మోదు చేయ‌డం ప‌ట్ల‌ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియ‌స్‌గా స్పందించారు. ఈ అంశంపై ఎక్స్ వేదిక‌గా డీజీపీ ర‌విగుప్తా, ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్‌ను కేటీఆర్ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న‌వారిపై కేసులు ఎందుకు పెట్ట‌లేద‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఆర్టీసీ కొత్త లోగో అంటూ ప్ర‌చారం చేసిన టీవీ చాన‌ల్స్, ప‌త్రిక‌ల‌పై కేసులు ఎందుకు పెట్ట‌లేద‌ని అడిగారు. రాజ‌కీయ పెద్ద‌ల మాట‌లు విని వేధిస్తే మిమ్మ‌ల్ని కూడా కోర్టుకు లాగుతామ‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు.

”నా బంధువుకు రూ.10వేల కోట్ల కొవిడ్‌ కాంట్రాక్టు వచ్చిందని సీఎం ఆరోపించారు. సచివాలయం కింద నిజాం నగలు తవ్వకున్నట్లు కథ అల్లారు. కేంద్ర హోంమంత్రి నకిలీ వీడియోను రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారు. ఓయూకు చెందిన నకిలీ సర్క్యులర్‌ను పోస్టు చేశారు. నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తిని జైలులో ఎందుకు పెట్టరు?” అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

మరోవైపు టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై గురువారం ఆ సంస్థ ఎండీ సజ్జనార్‌ స్పందించారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. అధికారికంగా ఇప్పటి వరకు సంస్థ విడుదల చేయలేదని పేర్కొన్నారు. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న లోగో నకిలీదని స్పష్టం చేశారు. దీంతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని వివరించారు.

- Advertisement -


ఈ అంశంపై కూడా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ కొత్త లోగో అని చూపుతున్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. రాజకీయ పెద్దల మాటలు విని సామాన్యులను వేధిస్తే కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. టీజీఎస్‌ఆర్టీసీ లోగో అని వాట్సాప్ గ్రూప్‌లో కాంగ్రెస్ వారే షేర్ చేసి.. ఆ తర్వాత అక్రమ కేసులు పెట్టేది వారేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఇలా ఉందని ఎద్దేవా చేశారు. ఈ లోగో ను షేర్ చేసిన త‌మ నేత‌ల‌పై ఎందుకు కేసులు పెడుతున్నారంటూ నిల‌దీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement