Tuesday, December 3, 2024

Urmila Matondkar: చీరలో రంగీలా మెరుపులు…

మోడ్రన్ ఔట్ ఫిట్‌లో, చీరల్లో,చిట్టి పొట్టి నిక్కర్లలో,బికినీలో,స్విమ్ సూట్లలో ఏ విధంగా చూసినా సీనియర్ నటి ఊర్మిలా మటోండ్కర్ ఒక కిక్కు. పరువాలతో మత్తు చల్లడంలో ఊర్మిల తర్వాతే. రంగీలా చిత్రంలో ఊర్మిలలోని చాలా కోణాలను యువతరం ఇప్పటికీ మర్చిపోలేరు. సత్యలో ఒకలా .. భారతీయుడులో ఇంకోలా.. దౌడ్ లో మరోలా రకరకాల కోణాల్లో ఊర్మిల యువతరం హృదయాల్ని చిద్రం చేసింది.

హాఫ్ సెంచరీ ఏజ్ లోను ఊర్మిల అందం ఇప్పుడు యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఊర్మిల చీరలో ముగ్ధమనోహర రూపంతో ఆకర్షించింది. సిల్వర్ మెరుపుల డిజైనర్ చీరలో ఊర్మిల చాలా స్పెషల్ గా కనిపించింది. ఈ అందమైన చీరకు ముత్యాల అల్లిక ఎంతో స్పెషల్‌గా కుదిరింది. శారీ లవ్ ఫరెవర్! అంటూ అందమైన క్యాప్షన్ ని ఊర్మిల ఇచ్చారు. మనీష్ మల్హోత్రా దీనిని డిజైన్ చేసారు. ప్రస్తుతం ఊర్మిల చీర లుక్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తిరిగి రంగీలా రోజులను గుర్తు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement