Wednesday, May 22, 2024

యమహా ఈవీ స్కూటర్స్‌.. నియోస్‌, ఈ01 వెూడల్స్‌…

యమహా మొదటి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నియోస్‌ని ఆవిష్కరిం చింది. దీన్ని 2019 టోక్యో మోటార్‌ షోలో ప్రదర్శించిన ఈ02 కాన్సెప్ట్‌ ఆధారంగా రూపొందించారు. ఇందులో బ్యాటరీ మార్పిడి టెక్నాలజీ ఉంది. హబ్‌ మౌంటెడ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌తో పని చేస్తుంది. ఆల్‌ ఎల్‌ఈడీ లైటింగ్‌ సెటప్‌, ఫుల్‌ డిజిటల్‌ ఇన్‌స్ట్రమెంట్‌ క్లస్టర్‌ను అందిస్తుంది. బ్యాటరీని రైడర్‌ కాళ్ల మధ్యలో అమర్చారు. ఈ01లో మాక్సీ-స్కూటర్‌ స్టెలింగ్‌, విండ్‌ స్క్రీన్‌ ఫ్రంట్‌ ఏప్రాన్‌, ఫ్లోటింగ్‌ రియర్‌ సెక్షన్‌, వైడ్‌ హ్యాండిల్‌ బార్లు ఉంటాయి.

ఒకసారి చార్జింగ్‌ చేస్తే.. 120 కిలో మీటర్‌ వరకు వెళ్తుంది. 4 కేడబ్ల్యూహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో రానున్నాయి. 125 సీసీ స్కూటర్‌కు సమానంగా ఉంటుంది. గంటకు 90 కి.మీ వేగంతో వెళ్లగలదు. ఈ01 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ స్మార్ట్‌ ఫోన్‌ కనెక్టివిటీ గల ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement